చోరీ కేసులో నిందితురాలు అరెస్టు

1182చూసినవారు
చోరీ కేసులో నిందితురాలు అరెస్టు
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసును అపహరించే నిందితురాలిని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద ఉన్న 3.34 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బండిఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన శిరీష అనే మహిళ ఈ నెల 4న కట్టెల సంచిలో 3.34 తులాల బంగారు గొలుసును పెట్టుకొని కడపకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఉండగా గొలుసు చోరీకి గురైంది.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా శుక్రవారం స్థానిక అమ్మవారిశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాణెమ్మను అరెస్టు చేయగా, ఆమె వద్ద ఉన్న బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై అశోక్‌ను, సిబ్బంది ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై షామీర్‌ బాష, సిబ్బంది ఉన్నారు. నంద్యాల, నందికొట్కూరు, కర్నూలు ప్రాంతాల్లో ఆమెపై గతంలో చోరీ కేసులు ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్