పాఠశాలకు వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్థాపం చెంది పురుగుల మందుతాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి కోలుకోలేక మృతి చెందినట్లు సి. బెళగల్ ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సి. బెళగల్ జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శివప్రసాద్(17) పాఠశాలకు సక్రమంగా వెళ్లడంలేదని తండ్రి మందలించడంతో ఈనెల 15న ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు.