మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ గా టీడీపీ అధిష్ఠానం ఎవరి పేరును ప్రకటించలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం మంత్రాలయంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధిష్ఠానం ఇన్ చార్జ్ గా ఎవరి పేరును ఖరారు చేయకుండానే ఓ వర్గం నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో టీడీపీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తిక్కారెడ్డి అండగా ఉంటారన్నారు.