
పాలకొల్లులో డ్రైన్ పనులు పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల
AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం మంత్రి నిర్మల రామానాయుడు పర్యటించారు. రూ.14 కోట్లతో చేపట్టిన దమయ్యపర్తి డ్రైన్ కాంక్రీట్ గోడకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో డ్రైన్ పనులు విధ్వంసానికి గురయ్యాయన్నారు. నిధులను దారి మళ్లించి పురపాలికలను జగన్ నర్వీర్యం చేశారంటూ ఆరోపించారు. కానీ త్వరలో డ్రైన్ పనులు పూర్తి చేసి పాలకొల్లును ముంపు నుంచి కాపాడుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.