ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్య తన 15వ ఏట కొణిజర్ల మండలం తుమ్మలపల్లికి చెందిన జానకమ్మను వివాహమాడారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి కుమారుడు సైదులు ఏడాది క్రితం గుండెపోటుతో మరణించగా, 2వ కుమారుడు సత్యనారాయణ అనారోగ్యంతో మరణించారు. చిన్న కుమారుడు కనకయ్య రెడ్డిపల్లిలోనే దుకాణం నిర్వహిస్తున్నారు.