దరిపల్లి రామయ్య ఐదో తరగతి వరకు చదువుకున్నారు. మల్లేశం సర్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగాలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు హాబీ.