ఈనెల 20వ తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్సులు మంజూరు చేసిన వెండర్లచే ఇసుక నిల్వ డిపోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజ కుమారి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనాకు నంద్యాల నుంచి వివరించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుండి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఇసుక సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.