ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి. నాగన్న డిమాండ్ చేశారు. గురువారం ఓర్వకల్లు మండలం నన్నూరు సచివాలయంలో మండల అధికారి ఈఓఆర్డీ సుబ్బరాయుడును కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. పనులు చేయనివారు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు రాజకీయ పలుకుబడి ఉన్నవారు మాస్టర్లలో పేరు నమోదు చేసుకొని ఉపాధి డబ్బులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు.