గడివేములలో పట్టపగలే దొంగల బీభత్సం
పాణ్యం నియోజకవర్గంలోని గడివేములలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం నట్టనడిరోడ్డు మీద ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గడివేములకి చెందిన కురువ పెద్దన్న ఇంట్లో ఎనిమిది తులాలు బంగారం, రూ. 13 వేల నగదు దోచుకెళ్ళారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.