కర్నూలు జిల్లాలో నవంబర్ 1వ తేదీన జరిగే దీపావళి పండుగ కోసం టపాకాయల విక్రయాల కోసం ఆసక్తి ఉన్న వారు తాత్కాలికంగా లైసెన్స్ లు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కర్నూలు ఆర్డీవో ఎం. శేషిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అంతేకాక టపాసుల కొత్త లైసెన్స్ లు, ఫారం-ఎల్ ఈ-5 లైసెన్స్ కోసం కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంబంధిత తహసీల్దార్ల ద్వారా వచ్చే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.