వెల్దుర్తి: పురుగుమందు తాగి బాలుడు మృతి
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. యల్.బండ గ్రామానికి చెందిన శేఖర్ కుమారుడు ఎల్లకృష్ణ (12) ఓ స్కూల్లో చదువుకుంటున్నాడు. అయితే గత 5రోజులుగా బాలుడు స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఇవాళ ఉదయం పురుగుమందు తాగాడు. తల్లిదండ్రులు గమనించి హుటాహుటిగా కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.