కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
వెల్దుర్తి మండలంలోని హైవే- 44పై మదారపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన శ్రావణ్ మహేశ్ గాయపడ్డాడు. గుంతకల్ నుంచి హైదరాబాద్ కు కారులో వెళ్తున్న శ్రావణ్ మహేశ్ సంఘటనా స్థలంలో కారు పక్కకు ఆపి డ్రైవింగ్ సీటు నుంచి దిగుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం కారును, మహేష్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కర్నూలు ఆసుపత్రికి తరలించారు.