రోజూ ఉదయం నిద్ర లేవగానే కలబంద జ్యూస్ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కలబందలో క్యాలరీలను బర్న్ చేసే సమ్మేళనాలు జీవక్రియను వేగవంతం చేస్తాయి. తరచుగా మలబద్దకంతో బాధపడే వారికి మంచి మోషన్ మెడిసిన్‌గా సహాయపడుతుంది. అంతేకాక, అలోవెరా జ్యూస్ శరీరాన్ని శుద్ధి చేస్తుంది. చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. తరచుగా అనారోగ్యాలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజూ కలబంద జ్యూస్ తాగుతుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.