ఎమ్మిగనూరు: త్వరలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు: మంత్రి

64చూసినవారు
ఎమ్మిగనూరు: త్వరలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు: మంత్రి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన ఆమె స్థానిక కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డితో కలిసి మాట్లాడారు. త్వరలో ఎమ్మిగనూరులో టెక్స్‌టెల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

సంబంధిత పోస్ట్