బస్సు నడిపిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోకు మంజూరైన బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన కొద్ది దూరం బస్సును నడిపారు. ఎమ్మెల్యే డ్రైవింగ్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మరోవైపు తమ ప్రాంతానికి కొత్త బస్సు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.