నందిగామలో తాపీ మేస్త్రి హత్య

75చూసినవారు
నందిగామలో తాపీ మేస్త్రి హత్య
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడిలో దారుణం చోటుచేసుకుంది. నందిగామ మండలం పల్లగిరికి చెందిన తాపీ మేస్త్రి షేక్ నాగుల్ మీరా(36)ను హత్య చేసి, మృతదేహాన్ని సుబాబుల్ తోటలో పడేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, స్నేహితులతో ఘర్షణే హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్