ఉదయాన్నే ఖాళీ కడుపుతో జాజికాయ నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జాజికాయలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జాజికాయ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. జాజికాయలో ఉండే అనాల్జేసిక్ లక్షణాలు తలనొప్పి, మైగ్రేన్ దాడుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.