వరుస ఎన్‌కౌంటర్‌లతో చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నెత్తురోడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం సుక్మా- బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి.. మావోయిస్టులకు సంబంధించిన భారీ బంకర్‌ను గుర్తించాయి. పోలీసులు టార్గెట్‌గా దాడులు చేసేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టులు బాంబులను తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బంకర్‌లో ఉన్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.