వరద నియంత్రణ చర్యలపై సమీక్ష చేసిన మంత్రి నిమ్మల

81చూసినవారు
వరద నియంత్రణ చర్యలపై సమీక్ష చేసిన మంత్రి నిమ్మల
కొల్లేరు నుంచి ఉప్పుటేరు కలిసేచోట పూడిక పెరిగిపోతోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నారాయణతో కలిసి ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు.  బుడమేరు, కృష్ణా నదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చ జరిపారు. ప్రజలకు ఇబ్బందిలేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి సమాలోచనలు చేశారు.

ట్యాగ్స్ :