25 ఏళ్ల క్రితం తప్పిపోయిన 60 ఏళ్ల వృద్ధుడు తిరిగి కుటుంబాన్ని కలుసుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా చెన్నైలోని ‘ఉదవుం కరంగళ్’ స్వచ్ఛంద సంస్థ అందరికీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. చిరిగిన దుస్తులతో ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధుడ్ని సంస్థ ప్రతినిధులు చూశారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తన పేరు పేకేటి పెద్దిరాజు అన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా అతడిని గుర్తించి, పాలకొల్లు సమీపంలోని యలమంచిలిలంకలోని కుటుంబ సభ్యలకు అప్పగించారు.