చంద్రబాబుపై మంత్రి రోజా సెటైర్లు

1509చూసినవారు
చంద్రబాబుపై మంత్రి రోజా సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ముస్లింలతో ఇఫ్తార్ విందులో వాళ్లు వచ్చారు కాబట్టే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. "అబ్బా.. బీజేపీ కోరితేనే తాను పొత్తుకు ఒప్పుకున్నాడట. నిజానికి బీజేపీతో పొత్తు కోసం దత్తపుత్రుడు పవన్ తో కలిసి ఢిల్లీలో పడిగాపులు కాసింది అందరికి తెలుసు. వినేవారు ఉంటే ఎన్ని కథలైనా అల్లుతాడు" అంటూ రోజా ఎద్దేవా చేశారు.