ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం పెద్ద కంబలూరు గ్రామానికి చెందిన థామస్ అనే వ్యక్తికి చెందిన గడ్డి వాము బుధవారం దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు గుర్తు తెలియని ఆకతాయిలు బీడీ కాల్చి పడేయడంతో మంటలు రాసుకుని గడ్డివామి దగ్ధమైంది. రైతుకు సుమారు 70 వేల రూపాయల ఆస్తి నష్టం వాటిలినట్లు తెలిపారు. స్థానికులు మంటలను గమనించి అప్రమత్తమై మంటలను ఆర్పారు. లేకపోతే మoటలు వ్యాపించి మరింత నష్టం జరిగేదని అన్నారు.