ఘనంగా రంజాన్ పండుగ సామూహిక ప్రార్ధనలు

76చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని ఈద్గానందు రంజాన్ పండగను గురువారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డలోని లింగందిన్నె గ్రామ మార్గంలోని ఈద్గా వద్ద ఆళ్లగడ్డ మండల ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ ప్రార్థనలు చేయించి రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే గతించిన వారి కోసం ప్రత్యేక దువా చేశారు.

సంబంధిత పోస్ట్