గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వారి సోదరులు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణస్వామి శనివారం మాళ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని అన్నారు. ఈ విజయదశమి ప్రతిఒక్కరూ సుఖ సంతోషం ఉండాలని ఎమ్మెల్యే జయరాం ఆకాంక్షించారు.