ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకు వెళ్లి సమస్యలపై వినిపించాలని కోరడంలో తప్పేంటని ఆలూరు టీడీపీ ఇన్ చార్జి వీరదభ్ర గౌడ్ ప్రశించారు. శుక్రవారం ఆలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తుందని, చిప్పగిరి మండలానికి రూ. 60 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు ఇవ్వాలేదని ఆరోపించారు.