బేతంచర్ల పట్టణం బైటి పేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకి మండల, పట్టణ అధికారులతో పాటు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఇళ్లకు వెళ్లి ఈ వంద రోజుల్లో సాధించిన ప్రగతిని వివరించడంతో పాటు ప్రజా వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.