బనగానపల్లెలో రీ సర్వే భూ సమస్యల పరిష్కార కార్యక్రమం
రీసర్వే భూ సమస్యల పరిష్కార కార్యక్రమంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ నారాయణరెడ్డి సోమవారం పేర్కొన్నారు. బనగానపల్లె మండలంలోని గ్రామాల్లో భూ సమస్యల పరిష్కార కార్యక్రమం ఈనెల 22 వతేది నుంచి నవంబర్ 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2020 సంవత్సరం నుంచి 2024 వరకు చేపట్టిన భూ రీసర్వేలో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులు ఆదేశించారని పేర్కొన్నారు.