డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆద్వర్యంలో ఆదివారం డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త రఫి మాట్లాడుతూ మన భారతదేశంలో చాలా మందికి మానవ హక్కుల విలువలు కూడా తెలియదు. మన దేశ ప్రజలకు మన రాజ్యాంగ గ్రంథం పై పూర్తి స్ధాయిలో అవగాహణ కలిగించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయించాలని వారు కోరారు.