
డోన్: బేతంచెర్ల పోలీసుల ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
బేతంచెర్ల పిఎస్ సిబ్బంది హెచ్. కొట్టాల గ్రామంలో బుధవారం ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ అవసరం, ట్రిపుల్ రైడింగ్ ప్రమాదాలు, ఓవర్లోడ్ ప్రయాణం ముప్పు, ట్రాఫిక్ చట్టాలు, సైబర్ నేరాలపై గ్రామస్థులకు వివరించారు. భద్రతకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రజలలో పోలీస్ శాఖ చైతన్యాన్ని పెంచుతోంది. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించే మానసికత పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుందని పోలీసులు తెలిపారు.