ఇంటి ముందు ఆడుకుంటున్న అభం శుభం తెలియని చిన్నారి వాసంతిని మత్తు పదార్థాలకు బానిసలైన మైనర్ బాలురు ఎత్తుకుపోయి అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్, కోయిల కొండ నాగరాజు ఆదివారం డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిన్న రహిమాన్, తారక నగర్ సిపిఎం శాఖ కార్యదర్శి అక్బర్ బాషా పాల్గొన్నారు.