కౌతాళం మండలంలోని గుడి కంబాళి గ్రామంలో మంగళవారం సెబ్ అధికారులు జరిపిన దాడులలో అదే గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 30 ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదోని సెబ్ పోలీసులు తెలిపారు. అక్రమ మద్యంపై నిఘా ఉంచామన్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.