పత్తికొండ: పైపులైన్‌ ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ మంజూరు చేయాలి

59చూసినవారు
పత్తికొండ: పైపులైన్‌ ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ మంజూరు చేయాలి
2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం రూ. 260 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు నింపే కార్యక్రమానికి పనులు మొదలు పెట్టగా, గత వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయకుండా వదిలేసిందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. సోమవారం కర్నూలు డీఆర్సీ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుతం ఆ పైపులు లీకేజీ అయి పొలాలు చెడిపోతున్నాయనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. పైపులైన్‌ ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ మంజూరు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్