తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం (వీడియో)
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దేవీపట్నం మండలం రావిలంకలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్ల చుట్టుపక్కల ఆవరణలోనూ మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.