AP: చేనేతలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన థ్రిఫ్ట్ (పొదుపు) ఫండ్ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుకు గాను 2024-25 ఏడాదికి రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో 395 చేనేత సంఘాల్లోని 17,633 కార్మికులకు లబ్ధి చేకూరింది. మార్చి నాటికి మిగతా రూ.3.50 కోట్లను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.