వాల్మీకుల అభివృద్ధికోసం జరుపుతున్న రాష్ట్రస్థాయి వర్క్ షాప్ను జయప్రదం చేయాలని ఏపీ వాల్మీకి బోయ సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూరు మండలం ఎం. లింగాపురం గ్రామంలో కరపత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి బోయలు కోల్పోయిన రాజ్యాంగ హక్కులు, సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కూడిన డిమాండ్స్ పైన అవగాహన కోసం రాష్ట్ర స్థాయి వర్క్షాపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.