Oct 21, 2024, 02:10 IST/పరిగి
పరిగి
బొంరాస్ పేట: ఎంఈఓ, ఉపాధ్యాయులకు ఘన సన్మానం
Oct 21, 2024, 02:10 IST
బొంరాస్ పేట మండల కేంద్రంలో గతంలో ఎంఈఓగా విధులు నిర్వహించి ప్రస్తుతం కొడంగల్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న రాంరెడ్డిని, ఇటీవల బదిలీల్లో భాగంగా వివిధ పాఠశాలలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను పీఆర్టియూ మండల శాఖ ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బొంరాస్ పేట, దుద్యాల మండల అధ్యక్షులు అనిల్ కుమార్, నరేందర్, ప్రధాన కార్యదర్శులు శశిధర్, వెంకటయ్య ఉన్నారు.