జగన్‌ 11 మందితో అసెంబ్లీకి వెళ్లింది.. 11 నిమిషాలు ఉండేందుకా?: షర్మిల

65చూసినవారు
జగన్‌ 11 మందితో అసెంబ్లీకి వెళ్లింది.. 11 నిమిషాలు ఉండేందుకా?: షర్మిల
వైసీపీ అధినేత జగన్‌ 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చింది 11 నిమిషాలు ఉండటానికా? అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. జనాలు ఛీకొడుతున్నా జగన్ తీరు మారడం లేదని విమర్శించారు. 'అటెండెన్స్ కోసం అసెంబ్లీకి వచ్చారా? వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు, ప్రజాసమస్యల మీద వారికి చిత్తశుద్ది ఉందనుకుంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలి.' అని ఎక్స్‌ వేదికగా షర్మిల సోమవారం సంచలన పోస్ట్‌ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్