పోలేరమ్మ తిరుణాలలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల
నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని కమ్మపాలెం గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదివారం పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాల స్వీకరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామం లోని నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ. గ్రామంలోని సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు.