అరుదైన 2 తలల పాము.. ఒక తలకు ఆహారమిస్తే మరో తలకు కోపం (వీడియో)

61చూసినవారు
టైగర్ లిల్లీ అనే పేరున్న రెండు తలల ర్యాట్ స్నేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పామును అమెరికాలోని మిస్సోరీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ (MDC) కాపాడింది. ప్రస్తుతం ఈ పాము కాన్సాస్ సిటీలోని నేచర్ సెంటర్‌లో ఉంది. ఇక ఈ 2 తలల పాముకు కోపం చాలా ఎక్కువ. ఒక తలకు ఆహారం ఇచ్చే సమయంలో మరో తలకు సిబ్బంది క్యాప్ కప్పుతున్నారు. ఈ అరుదైన పాము వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్