Dec 05, 2024, 03:12 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Dec 05, 2024, 03:12 IST
కరీంనగర్ పట్టణంలోని రిలయన్స్ మార్ట్ ముందు ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని కాలేజీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సాలేహ్ నగర్‌కు చెందిన అబ్బు(19) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.