AP: తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల బుధవారం విలేకర్లతో మాట్లాడారు. నాతో వారికి వ్యక్తిగత విభేదాలు (పర్సనల్ ఇష్యూస్) ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని.. అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.