కన్నకొడుకే తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. తన తండ్రి పదే పదే తోబుట్టువులతో పొలుస్తూ అవమానించాడని రాజేష్ అనే వ్యక్తి తల్లిదండ్రులను, సోదరిని హత్య చేశాడు. ఢిల్లీలో బుధవారం ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం తాను ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లి వచ్చేసరికి వారు చనిపోయి ఉన్నాయని రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో రాజేష్ బాగోతం బయటపడింది. మృతులు తండ్రి రాజేష్(55), తల్లి కోమల్(47), సోదరి కవిత(23)గా పోలీసులు గుర్తించారు.