పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ RTC క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.