కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అనూష ఆధ్వర్యంలో సోమవారం డైయల్ యువర్ కమీషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు వివిధ రకాల సమస్యలపై 9 అర్జీలు అందజేశారని కమిషనర్ అనూష తెలిపారు. వాటన్నిటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుతుందని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.