గుడ్లూరు మండలంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
అందరికీ ఆధార్ కార్డు ఉండాలనే లక్ష్యంతో గుడ్లూరు మండలంలో మంగళవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు స్పెషల్ ఆదార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిమ్మటిపాడు 22, మోచర్ల 23, చేవూరు 24, గుండ్లపాలెం 27, పురేటిపల్లి 28, నాయుడుపాలెం 29, గుడ్లూరు 30 దేవాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ కు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.