కందుకూరు: భూ సమస్యలపై 50 అర్జీలు
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం పరిధిలోని చాగల్లు గ్రామంలో తహసిల్దార్ వి. లావణ్య ఆధ్వర్యంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. రీ సర్వేలో భాగంగా జరుగుతున్న ఈ గ్రామ సభకు గ్రామస్తులు వారి యొక్క భూ సమస్యలపై 50 దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తులన్నిటిని పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని తహసిల్దార్ తెలిపారు. గతంలో జరిగిన భూముల అవకతవకలపై నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా ఆమె సూచించారు.