తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు న్యూఇయర్ కానుక అందించింది. ఆయిల్ పామ్ గెలల ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్ను పామాయిల్ గెలల ధర రూ. 20,506గా నిర్ణయించింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.