కందుకూరు: అక్రమంగా విక్రయిస్తున్న 30 మద్యం సీసాలు స్వాధీనం

68చూసినవారు
కందుకూరు: అక్రమంగా విక్రయిస్తున్న 30 మద్యం సీసాలు స్వాధీనం
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఉలవపాడు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 30 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని వాకా గ్రామానికి చెందిన సాంబశివరావు అలగాయపాలెం రోడ్డు మార్గంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 30 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్