రాపూరు మండలంలోని కోటూరుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నాగలక్ష్మి తనను పంచాయతీ కార్యదర్శి చెంచయ్య లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఫిర్యాదు చేసింది. తన తండ్రికి సంబంధించిన మరణధృవీకరణ పత్రం మంజూరు చేయాలని కోరితే పంచాయతీ అధికారి వీడియో కాల్ చేసి నగ్నంగా కనపడాలని, లేదా రూమ్ కు రావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.