

నెల్లూరు: నరసింహస్వామి నుండి ఆదాయం రూ.7. 91 లక్షలు
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ వేదగిరి క్షేత్రంపై వేంచేసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 80 రోజులకు గాను వివిధ హుండీల ద్వారా రూ. 7. 91 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు. జొన్నవాడ ఏవో శ్రీనివాసులు రెడ్డి కూడా పాల్గొన్నారు.